మాట తప్పని,మడమ తిప్పని నేతగా ప్రజల మన్ననలు అందుకుంటున్న జననేత.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో–2019లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. పేదరికాన్ని పారదోలి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటన పరుగులు పెట్టించి నవ శకానికి నాందిపలికేలా.. మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ తన దార్శనికతను ఆవిష్కరించారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గం సంక్షేమం కోసం కృషి చేసి.. సమసమాజ స్థాపనకు పాటుపడతామన్నారు. ప్రత్యేక హోదా సాధించి.. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తెస్తామని ప్రకటించి.. లక్షల మంది యువత ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తామని హామీ ఇచ్చారు. మొత్తమ్మీద వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో నిర్మాణాత్మకంగా, ఆచరణ సాధ్యంగా, అన్ని వర్గాల ప్రజల మేలు కోరేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది!!

వైఎస్సార్‌ రైతు భరోసా